Friday, 9 August 2013

सुभाषितानि



सुभाषितानि
1.ऊँ सह नाववतु सहनौ भुनक्तु |
सह वीर्यं करवावहै |
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै |
! शान्ति: शान्ति: शान्ति: |

OM May that Brahman protect us both (Teacher & Disciple); May that Brahman nourish us both; May we work in harmony with great vigor; May our study be illuminating and fruitful; May we not hate each other. Om.. Peace, Peace.. Peace.

ఓం. ఆ పరమాత్మ మనలనిరువురనూ  (గురుశిష్యులను) రక్షించును గాక . మనలనిరువురనూ కలసి పోషించును గాక  . మన మిరువురమూ కలసి శక్తివంతులము అగుదుము గాక. మన  అధ్యయనము తేజోవంతమగును గాక. మనము ఒకరితో ఒకరు కలహించకుండెదము  గాక. ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇచ్చట మూడు విధములైన ఆటంకములు అనగా శరీరసంబంధమైన , ప్రకృతిసంబంధమైన , భగవత్సంబంధమైన కలుగకుండునుగాక.
(ఇది తైత్తరీయోపనిషత్తు ,కఠోపనిషత్తు, మాండూక్యోపనిషత్తులలో  చెప్పబడిన శాంతిమంత్రము. గురువు , శిష్యుడు కలసి చేసిన భగవతుని ప్రార్ధన.)
2 .पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् |
मूढै: पाषाणखण्डेषु रत्नसंज्ञा प्रदीयते ||

There are three jewels on earth: water, food, and a good saying . Fools, however, regard pieces of rocks as jewels.

            ఈ భూమిపై నీరు ,అన్నము , సుభాషితము అను మూడు మాత్రమే నిజమైన రత్నములు. కాని తెలివితక్కువవారు మాత్రము రాతి ముక్కలను రత్నాలని భ్రమపడుతుంటారు.

3 .अयं निज: परो वेति गणना लघुचेतसाम् |
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||

Considerations like “This is mine or this is another's" occur only to the narrow minded persons. To the broad-minded persons the whole world is a family.

          తక్కువ బుధ్ధి కలవారు మాత్రమే "ఇది నాది . ఇది పరాయివానిది " అని లెఖ్కిస్తూ ఉంటారు. కాని ఉదారమైన స్వభావం గలవారు మాత్రము ఈ భూమి అంతటినీ ఒకే కుటుంబంగా పరిగణిస్తారు.

No comments:

Post a Comment